కాళేశ్వరం జలాలతో రిజర్వాయర్లు నింపాలి | - | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం జలాలతో రిజర్వాయర్లు నింపాలి

Jul 6 2026 1:22 AM | Updated on Jul 6 2026 1:22 AM

లక్ష క్యూసెక్కుల జలాలు

వృథా అవుతున్నాయి

ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

వేల్పూర్‌: కాళేశ్వరం జలాలతో రిజర్వాయర్లను నింపి రైతులనుఆదుకోవాలని, వెంటనే కన్నెపల్లి పంప్‌హౌస్‌ మోటార్లను ఆన్‌ చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మోర్తాడ్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ది అంతా అసత్య ప్రచారమేనని అన్నారు. కేసీఆర్‌పై కోపంతో రైతుల కడుపు కొట్టొద్దని హితవు పలికారు. మీకు చేతగాకుంటే కేసీఆర్‌కు అప్పజెప్పాలని, ఆయన 15 రోజుల్లో నీటిని నింపి చూపిస్తారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి మూసీ సుందరీకరణ, ఫ్యూచర్‌ సిటీ పేరుతో నిధులు దోచుకోవడం మీద ఉన్న శ్రద్ధ రైతులకు సాగునీరందించడంలో లేదన్నారు. తమ పోరాటానికి రైతులు కలసి రావాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు శేఖర్‌రెడ్డి, కల్లెడ ఏలి యా, నాగధర్‌రెడ్డి, బద్దం ప్రవీణ్‌రెడ్డి, రాజాపూర్ణానందం, బద్దం రవి, బద్దం అశోక్‌, ఆర్మూర్‌ మ హే శ్‌, ఏలేటి రమేశ్‌, బోగ ఆనంద్‌, పర్శ దేవన్న, పాపా యి పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement