తీరనున్న కల! | - | Sakshi
Sakshi News home page

తీరనున్న కల!

Jul 6 2026 1:22 AM | Updated on Jul 6 2026 1:22 AM

తీరనున్న కల!

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న కామారెడ్డి – మెదక్‌ జిల్లాల మధ్య రోడ్డు పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. వెంకపల్లి– ముద్దాపూర్‌ మధ్యలో మంజీర నదిపై నిర్మించిన వంతెన అవతలి వైపు అప్రోచ్‌ రోడ్డుకు ప్ర భుత్వం రూ.22.50 కోట్లు మంజూరు చేసింది. కా మారెడ్డి జిల్లా ధర్మారెడ్డి నుంచి మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం ముద్దాపూర్‌ వరకు రోడ్డు, ఇరు జిల్లాల మధ్య మంజీరా నదిపై వంతెన నిర్మాణానికి 2015 లో అప్పటి ప్రభుత్వం రూ.33 కోట్లు మంజూరు చేసింది. వీటిలో సుమారు రూ.12 కోట్లతో మంజీర నదిపై వంతెన నిర్మాణం, కామారెడ్డి జిల్లా పరిధిలో రోడ్డు పనులను పూర్తిచేశారు. అయితే, వంతెన అవతలి వైపు మెదక్‌ జిల్లా పరిధిలో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. మంజీరా నదికి అవతలి వైపు అప్రోచ్‌ రో డ్డు పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని ఇరుజిల్లాల ప్రజలు పలుమార్లు ఎల్లారెడ్డి, మెదక్‌ ఎమ్మెల్యేలు మదన్‌మోహన్‌రావు, మై నంపల్లి రోహిత్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రోచ్‌ రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వం నిధు లు మంజూరు చేసింది. ఈ నిధులతో మెదక్‌ జిల్లా పరిధిలోని పాపన్నపేట వరకు 2.9 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించనున్నారు.

కామారెడ్డి – మెదక్‌ జిల్లాల మధ్య అప్రోచ్‌ రోడ్‌కు నిధులు మంజూరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement