రైతు బాగుంటేనే.. రాజ్యం బాగుంటుందనే స్ఫూర్తితో పాలన | - | Sakshi
Sakshi News home page

రైతు బాగుంటేనే.. రాజ్యం బాగుంటుందనే స్ఫూర్తితో పాలన

Jul 5 2026 7:56 AM | Updated on Jul 5 2026 7:56 AM

జిల్లా ఇన్‌చార్జి మంత్రి

ధనసరి అనసూయ

శ్రద్ధానంద్‌ గంజ్‌లో రూ.6.56

కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

సుభాష్‌నగర్‌: తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. రైతాంగ ప్రయోజనాలు కాపాడటమే ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. నిజామాబాద్‌ నగరంలోని మార్కెట్‌ కమిటీ (శ్రద్ధానంద్‌ గంజ్‌) ఆవరణ లో రూ.6.56 కోట్లతో చేపట్టనున్న షెడ్ల నిర్మాణా లు, మడిగెలు, సోలార్‌ విద్యుత్‌, తదితర అభివృద్ధి పనులకు రూరల్‌ ఎమ్మెల్యే ఆర్‌ భూపతిరెడ్డి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, నగర మేయర్‌ ఉమారాణితో కలి సి సీతక్క శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే.. రాజ్యం బాగుంటుందనే స్ఫూర్తితో ప్రభుత్వం పాల న చేపడుతోందన్నారు. రైతుల సంక్షేమం కోసం రు ణమాఫీ, రైతు భరోసా, బోనస్‌, తదితర అనేక పథకాలు అమలు చేస్తోందని గుర్తుచేశారు. రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా యాసంగి సీజన్‌ లో పెద్ద ఎత్తున పంటలు సాగుచేశారన్నారు. ప్రతి పంటకు పూర్తిస్థాయిలో మద్దతు ధర చెల్లిస్తూ, చివ రి గింజ వరకు ప్రభుత్వమే పంట దిగుబడులను కొనుగోలు చేసి రైతులను ఆదుకుందని అన్నారు.

యార్డు అభివృద్ధికి నిధులు

మంజూరు చేయిస్తా..

నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు వీలుగా సీఎంతోపాటు వ్యవసాయశాఖ మంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మార్కెట్‌ యార్డులోని అర్హులైన హమాలీలకు ఇందిరమ్మ ఇళ్లు, డబుల్‌ బెడ్‌రూమ్‌లు మంజూరు చేసేలా చొరవ చూపుతానన్నారు. హమాలీల కోసం ప్రత్యేకంగా బోర్డు, కనీస వేతన చట్టాన్ని సీఎం ఇటీవల ప్రకటించారని గుర్తుచేశారు.

పూర్వవైభవం తీసుకొస్తున్నాం..

నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆర్‌ భూపతిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో మార్కెట్‌యార్డును నిర్లక్ష్యం చేశారని, కనీసం పాల కవర్గాన్ని నియమించలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుతో పాలకవర్గాన్ని ప్రకటించామని, మార్కెట్‌యార్డుకు పూర్వవైభవం తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. గంజ్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.

ఏఎంసీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ.. పసుపు రైతుల కోసం గంజ్‌లో కోల్డ్‌ స్టోరేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ప్రత్యే క ధన్యవాదాలు తెలిపారు. అర్హులైన కార్మికులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేయాలని, కూ రగాయల హోల్‌సేల్‌ మార్కెట్‌లో మరో 20 మడిగెల నిర్మాణానికి, మార్కెట్‌ కమిటీ కార్యాలయ ని ర్వహణ కోసం ప్రతినెలా నిధులు కేటాయించేలా చ ర్యలు చేపట్టాలని మంత్రికి విన్నవించారు. అనంత రం మంత్రి సీతక్కకు మార్కెట్‌ కమిటీ పాలకవర్గం పట్టుచీరను అందించి ఘనంగా సత్కరించింది. మంత్రితోపాటు రూరల్‌ ఎమ్మెల్యేను రైస్‌మిల్‌, మర్చంట్‌ అసోసియేషన్‌, కూరగాయల హో ల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్‌ అసోసియేషన్‌, గుమాస్తా, దడువాయిలు, హమాలీలు, చాటా కార్మికుల అసోసియేషన్‌ తరఫున ఘనంగా సన్మానించారు.

అదనపు కలెక్టర్‌ భుజంగరావు, మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ జంగిటి రాంచందర్‌, డీఎంవో గంగు, సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రెటరీ విజయ్‌కిశోర్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, కెతావత్‌ యాదగిరి, చిన్న సాయిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు, సర్పంచులు, సొసైటీ చైర్మన్లు, ఆయా మండలాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

త్వరలో మాస్టర్‌ ప్లాన్‌

నిజామాబాద్‌ నగర సర్వతోముఖాభివృద్ధి కోసం త్వరలోనే మాస్టర్‌ ప్లాన్‌ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని, తద్వారా నగర ప్రజలకు అనేక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని, విరివి గా నిధులు మంజూరు అవుతాయని మంత్రి సీతక్క అన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో పయనింపజేసేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జిల్లా కేంద్రంతోపాటు రూరల్‌ నియోజకవర్గంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఇన్‌చార్జి మంత్రి సీతక్క ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లిలోని గిరిజన బాలికల సంక్షేమ కళాశాలలో అదనపు వసతిగృహ సముదాయం, కిచెన్‌, డైనింగ్‌ హాల్‌ను విద్యార్థులతో కలిసి ప్రారంభించారు. అలాగే కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. – ఇందల్‌వాయి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement