నాలుగు కేటగిరీలు.. 318 రకాల పనులు | - | Sakshi
Sakshi News home page

నాలుగు కేటగిరీలు.. 318 రకాల పనులు

Jul 5 2026 7:56 AM | Updated on Jul 5 2026 7:56 AM

జిల్లాలో జాబ్‌ కార్డులు 2.51 లక్షలు

సభ్యులు 4.58 లక్షలు

యాక్టివ్‌ జాబ్‌ కార్డులు 1.56 లక్షలు

యాక్టివ్‌ కూలీలు 2.31 లక్షలు

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌ గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ గ్రామీణ్‌’ (వీబీ – జీ రామ్‌ జీ) చట్టం ఈనెల 1 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. అయితే, దీనిని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూనే తప్పదనట్లుగా అమలుకు గెజిట్‌ను విడుదల చేసింది. దశాబ్దాలుగా సాగుతున్న మహా త్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం (ఈజీఎస్‌–2005) స్థానాన్ని ఈ కొత్త చట్టం భర్తీ చేయనుంది. ఇందులో పనులు, కూలీల పనిదినాలు మారాయి. మొన్నటి వరకు ఉపాధిహామీ కింద ఏడాదికి కేవలం 100 రోజులు మాత్రమే పని క ల్పించేవారు. కానీ, కొత్త చట్టం ప్రకారం ప్రతి గ్రా మీణ కుటుంబానికి ఏడాదికి కనీసం 125 రోజుల ఉపాధిని కల్పించనున్నారు. అదే విధంగా ఇప్పటికే ఈ – కేవైసీ పూర్తయిన పాత ఉపాధిహామీ జాబ్‌ కార్డుల స్థానంలో కొత్తగా డిజిటల్‌ భద్రతా ఫీచర్లతో కూడిన కార్డులను ఇవ్వనున్నారు. నిధుల విషయానికి వస్తే కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాల ఖర్చుల వాటా 60:40 నిష్పత్తిలో ఉండనుంది. పని పూర్తి చేసిన పక్షం రోజుల్లోనే కూలీలకు వేతనాలు అందనున్నాయి. వీబీ – జీ రామ్‌ జీ చట్టంపై ఇప్పటికే జిల్లా నుంచి పలువురు ఎంపీడీవోలు హైదరాబాద్‌లో శిక్షణ పొంది వచ్చారు.

నీటి భద్రత పనులు, జీవనోపాధి

మౌలిక వసతులు

● భూగర్భ జలాలను పెంపొందించడానికి చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం, కొత్త చెరువుల తవ్వకం, పాత చెరువుల్లో పూడికతీత, వర్షపు నీటిని నిల్వ చేసే ఇంకుడు గుంతల నిర్మాణాలు ఉంటాయి. అలాగే, వ్యవసాయానికి నీరందించే చిన్న కాలువల నిర్మాణాలు, నిర్వహణ.

● మహిళా సంఘ భవనాలు, ఇందిరమ్మ ఇళ్లు, పంచాయతీ భవనాలు, వర్క్‌షెడ్ల నిర్మాణం, రైతు లు పంట దిగుబడులను నిల్వ చేసుకునేందుకు గోదాములు, కోల్ట్‌ స్టోరేజీలను నిర్మించుకోవచ్చు. స్థానిక ఉత్పత్తుల అమ్మకాల కోసం సంతల వేదికలు (రూరల్‌ హాట్స్‌), జీవనోపాధిని పెంచుకోవడానికి పశువుల షెడ్లు, మత్స్య సంపదకు మౌలిక వసతులు అలాగే మొక్కల పెంపకం కేంద్రాలు, సేంద్రియ ఎరువుల యూనిట్లు కట్టుకోవచ్చు.

● పొలాలకు వెళ్లే దారులు, వీధుల్లో అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, మట్టి రోడ్లు నిర్మించుకోవచ్చు. అలాగే పంట ఉత్పత్తులను ఆరబోసేందుకు సీసీ కల్లాలు కట్టుకోవచ్చు. వరద నీరు ఊళ్లోకి రాకుండా డ్రైనేజీ కాల్వల నిర్మాణం, భూసార పరిరక్షణ పనులు చేసుకోవచ్చు.

చాలా రకాల పనులున్నాయి

ప్రభుత్వం రూపొందించిన వీబీ – జీ రామ్‌ జీ వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చింది. నాలుగు కేటగిరీల్లో మొత్తం 318 రకాల పనులున్నాయి. ఇకపై కొత్త చట్టం ప్రకారం గ్రామాల్లో పనులు, నిధుల చెల్లింపులు జరుగుతాయి.

– సాయన్న, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి

‘వీబీ–జీరామ్‌జీ’లో చేర్చిన

కేంద్ర ప్రభుత్వం

125 రోజులకు పెరగనున్న కూలీల

పనిదినాలు

చట్టంపై ఇప్పటికే హైదరాబాద్‌లో

శిక్షణ పొందిన ఎంపీడీవోలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement