● ప్రజారోగ్య పరిరక్షణకు
సమన్వయంతో పని చేయాలి
● వీసీలో రాష్ట్ర ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
నిజామాబాద్ అర్బన్: ఖరీఫ్ పంటల సాగు కోసం రైతులకు ప్రభుత్వ పరంగా పూర్తిస్థాయిలో తోడ్పాటునందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు అన్నారు. వ్యవసాయం, విత్తనాలు, ఎరువులు, ప్రజారోగ్యం, పంటల మార్పిడి, ఫార్మర్ రిజిస్ట్రి, తాగునీరు, ఇరిగేషన్, విద్య, వాతావరణ మార్పులు, ఉద్యానవనం, సూక్ష్మ సాగునీరు, ఆయి ల్ పామ్ విస్తరణ, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వానాకాలం సీజన్‌కు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, నకి లీ విత్తనాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నా రు. జూలై నెలకు అవసరమైన ఎరువులను ముందస్తుగా నిల్వ ఉంచాలని, యూరియా అక్రమ రవా ణా, అధిక ధరలకు విక్రయాలు, నిల్వలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, నానో యూరియా వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, జి ల్లా, డివిజన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను సిద్ధంగా ఉంచాలని అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ లో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడంతోపాటు ప్రత్యామ్నాయ పంటల సాగులో అవసరమైన మెలకువలు అందించడం జరుగుతోందన్నారు. ఎస్సారెస్పీ, నిజాంసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని, తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని సీఎస్‌కు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలను ఎప్పటికప్పు డు సందర్శిస్తున్నామన్నారు. సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్‌వో గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, అధికారులు పాల్గొన్నారు.


