పవర్‌ హౌజ్‌లో ఆకస్మిక తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

పవర్‌ హౌజ్‌లో ఆకస్మిక తనిఖీలు

Jul 5 2026 7:56 AM | Updated on Jul 5 2026 7:56 AM

ఉదయం 7గంటలకే

ప్రత్యక్షమైన సీఎండీ వరుణ్‌రెడ్డి

హడలెత్తిన అధికారులు, సిబ్బంది

సుభాష్‌నగర్‌: జిల్లా కేంద్రంలోని పవర్‌హౌజ్‌ కంపౌండ్‌లో టీజీ ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉదయం 7 గంటలకే సాధారణ వ్యక్తిలా వచ్చిన సీఎండీ.. ఏడీఈ స్టోర్స్‌, ఏఈ అవుట్‌డోర్‌, ఇండోర్‌తోపాటు స్టోర్‌ అంతా కలియతిరిగారు. సీఎండీ వచ్చిన విషయం తెలుసుకున్న ఎస్‌ఈ, డీఈలు, ఏడీఈలు, ఏఈలు హుటాహుటిన అ క్కడికి చేరుకున్నారు. ఆకస్మిక తనిఖీలతో ఉద్యో గులు, సిబ్బందిని సీఎండీ ఉరుకులు, పరుగులు పెట్టించారు. ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు, డీఈలు శ్రీనివాస్‌రావు, వెంకటరమణ, ఏడీఈ లు, ఏఈ లతో కలిసి పవర్‌హౌజ్‌ ఆవరణంతా పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎస్‌ఈ కార్యాలయాన్ని సందర్శించి ఉద్యోగులు, సిబ్బందితో ఇంటరాక్ట్‌ అ య్యారు. ప్రతిఒక్కరిని ఆప్యాయతతో పలకరించి సమస్యలను తెలుసుకున్నారు. సంస్థ అభివృద్ధి కోసం పని చేయాలని సూచించారు. ఈసందర్భంగా ప్రమోషన్ల గురించి ఇంజినీర్లు, స్టాఫ్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వారి వెంట ఏడీఈలు తోట రాజశేఖర్‌, చంద్రశేఖర్‌, ప్రసాద్‌రెడ్డి, వినోద్‌, ఏఈలు, ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement