బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించండి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించండి

Jul 5 2026 7:56 AM | Updated on Jul 5 2026 7:56 AM

నేరాల నియంత్రణకు కృషి చేయాలి

బాసర జోన్‌ డీఐజీ భాస్కరన్‌

నాలుగు జిల్లాల పోలీస్‌బాస్‌లతో సమీక్ష

నిజామాబాద్‌అర్బన్‌: ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి శాఖపై ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంపొందించాలని బాసర జోన్‌ డీఐజీ భాస్కర్‌ అన్నారు. నేరాల నియంత్రణ కు కృషి చేయాలన్నారు. నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల పోలీస్‌ అధికారులతో శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో సమావేశమయ్యారు. రేంజ్‌ పరిధిలోని జిల్లాల్లో శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ, కే సుల దర్యాప్తు, మహిళలు, చిన్నారుల భద్రత, సై బర్‌ నేరాల నియంత్రణ, ట్రాఫిక్‌ నిర్వహణ, మాదకద్రవ్యాల నిర్మూలన, కమ్యూనిటీ పోలీసింగ్‌ కార్యక్రమాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. జిల్లాల వారీ గా నమోదవుతున్న నేరాల తీరు, విచారణలో పురో గతి, తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. ప్రజల ఫిర్యాదులను సకాలంలో స్వీకరించడంతో పాటు పారదర్శకంగా విచారణ చేపట్టి త్వరి తగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి సైబర్‌ నేరాలను అరికట్టాలని, మహిళలు చి న్నారులపై జరిగే నేరాల కేసుల్లో వేగవంతమైన ద ర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూ డాలని ఆదేశించారు. అనంతరం రేంజ్‌ పరిధిలోని ఆయా జిల్లాల పోలీస్‌ అధికారులు, యూనిట్‌ ఇన్‌చార్జీలు తమ జిల్లాలకు సంబంధించిన పనితీరు, నేరల నియంత్రణ చర్యలు, ఎదురవుతున్న సమస్యలను డీఐజీకి వివరించారు. సీపీ సాయి చైతన్య, నిర్మల్‌ ఎస్పీ డాక్టర్‌ జానకి షర్మిల, ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్‌, అదనపు ఎస్పీలు, ఏసీపీలు, సీఐలు రిజర్వ్‌ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement