ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ తప్పనిసరి

Jul 5 2026 7:56 AM | Updated on Jul 5 2026 7:56 AM

ఆహార భద్రత అధికారిణి సవిత

హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు,

రెస్టారెంట్‌లలో ఆకస్మిక తనిఖీలు

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ నగరంలోని పలు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, రెస్టారెంట్లు, హోటళ్లలో జిల్లా ఆహార భద్రత అధికారిణి సవిత శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వంటశాలలు, పాత్రలు అపరిశుభ్రంగా ఉన్నాయని, నిషేధిత సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌ వాడుతున్నట్లు తనిఖీల్లో తమ దృష్టికి వచ్చినట్లు ఆమె తెలిపారు. కృత్రిమ రంగు వేసిన మాంసం విక్రయిస్తున్నారని, కలుషిత ఆహారాన్ని పారేశామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చట్టం 2006 సెక్షన్‌ 32 ప్రకారం నోటీసులు ఇచ్చామని, 14 రోజుల్లో లోపాలను సరి చేయని వారికి జరిమానాలు విధించి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) లైసెన్స్‌ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఆమె వెంట జిల్లా ఆహార భద్రతశాఖ ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement