● పట్టుబడిన పది మంది
● రూ.58,490 స్వాధీనం
డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ మండలం నూత్‌పల్లి శివారులో పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ పోలీసు బృందం శనివారం మెరుపుదాడి నిర్వహించింది. ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో ఈ ఆకస్మిక దాడి జరుగగా, పేకాట ఆడుతున్న బడా గ్యాంగ్ పట్టుబడింది. పోలీసుల కథనం ప్రకారం... నూత్‌పల్లి శివారులోని ఓ గెస్ట్‌హౌస్‌ను అడ్డాగా చేసుకొని కొంతమంది పేకాట ఆడుతున్నారు. నిఘా ఉంచిన పోలీసులు పక్కా సమాచారంతో శనివారం చీతా ఫోర్స్ మెరుపుదాడి చేయగా 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.58,490 నగదుతోపాటు పది సెల్‌ఫోన్లు, ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులు, నగదు, వాహనాలు, ఫోన్లను నందిపేట్ పోలీసులకు అప్పగించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా కొనసాగుతుందని ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు.


