ప్రగతి పరిశీలనకు పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ప్రగతి పరిశీలనకు పరీక్షలు

Jul 5 2026 7:56 AM | Updated on Jul 5 2026 7:56 AM

విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకే..

2 నుంచి 5వ తరగతి విద్యార్థులకు..

ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహణ

మొబైల్‌ యాప్‌లో పరీక్ష

ఖలీల్‌వాడి : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో వి ద్యా ప్రమాణాలు పెంచేందుకు, విద్యార్థుల్లో అభ్య సన సామర్థ్యాలను పరిశీలించేందుకు విద్యాశాఖ ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ(ఎఫ్‌ఎల్‌ఎన్‌)ను అమలుచేస్తోంది. తరగతులకు తగినవిధంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యం పెంచే లక్ష్యంతో గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూ డా ప్రభుత్వ బడుల్లో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఏడాదిలో మూడుసార్లు విద్యార్థుల అభ్య సన సామర్థ్యాలపై అధ్యయనం చేస్తారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో మొదటిసారిగా బేస్‌లైన్‌ పరీక్ష, నవంబరులో రెండోసారి టెస్ట్‌, చివరిలో పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెలలో నిర్వహించనున్న బేస్‌లైన్‌ పరీక్షలో జిల్లా వ్యాప్తంగా సుమారు 36 వేల మంది విద్యార్థులు పాల్గొననున్నారు.

సామర్థ్యం గుర్తించేలా..

ప్రాథమిక స్థాయిలో ధారళంగా చదవడం, రాయడం, చదివింది అర్థం చేసుకోవడం పిల్లలకు తప్పనిసరి. వీటన్నింటినీ నిర్ణీత సమయంలో పూర్తిచేసే విద్యార్థికి సామర్థ్యం ఉన్నట్లుగా గుర్తిస్తారు. ఈ విద్యా సంవత్సరంలో జూలై 1 నుంచి 29 వరకు పరీక్షలను పూర్తి చేయాలని మొదటగా బేస్‌లైన్‌ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈ నెల 8, 9వ తేదీల్లో 2, 3, 4, 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

యాప్‌లోనే పరీక్ష...

తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ మొబైల్‌ యాప్‌ ద్వారానే పూర్తిగా బేస్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల నమోదు, టీచర్ల సంఖ్య మేరకు పరీక్ష ఉంటుంది. తరగతిలోని టీచర్లు ఒక్కో విద్యార్థిని పిలిచి తెలుగు, ఇంగ్లిష్‌, గణితం సంబంధించిన ప్రశ్నలను అడిగి వారు ఇచ్చే సమాధానాలను ఫోన్‌లోని యాప్‌లో నమోదు చేస్తారు. విద్యార్థులు భాష, గణితంలో వెనుకబడి ఉంటే వారికి ప్రత్యేకంగా బోధన చేసి సామర్థ్యాలను పెంచేందుకు కృషి చేయనున్నారు.

పాఠశాలలు, విద్యార్థుల వివరాలు

ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు బేస్‌లైన్‌ పరీక్షను నిర్వహిస్తోంది. పరీక్ష ద్వారా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది.

– బాలకృష్ణ, కోఆర్డినేటర్‌, నిజామాబాద్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement