● రాష్ట్ర మంత్రి సీతక్క
● ఇందల్వాయిలో
అభివృద్ధి పనుల ప్రారంభం
ఇందల్వాయి: గిరిజనులతోపాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) పేర్కొన్నారు. ఇందల్వాయి మండలంలో ఆమె శనివారం పర్యటించారు. వెంగల్‌పాడ్ నుంచి డిచ్‌పల్లి మండలం రాంపూర్ గ్రామం వరకు రూ.5.48 కోట్ల తో చేపడుతున్న బీటీ రోడ్డు పనులు, కేకే తండా నుంచి మెఘ్యనాయక్ తండా వరకు రూ.2.94 కోట్ల తో రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. తిర్మన్‌పల్లి గ్రామంలో గిరిజన బాలికల సంక్షేమ క ళాశాలలో అదనపు వసతిగృహ సముదాయాన్ని మంత్రి ప్రారంభించి కళాశాల ఆవరణలో మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, కల్లుగీత కార్మికుల సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, ఉర్దూ అకాడమీ చైర్మ న్ తాహెర్‌బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, డీపీవో శ్రీనివాస్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, తిర్మన్‌పల్లి సర్పంచ్ చింతల కిషన్ పాల్గొన్నారు.


