● సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీ శ్రీనివాసులు
నందిపేట్ (ఆర్మూర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూముల రీసర్వే ప్రక్రియకు ప్రజలు సహకరించాలని జిల్లా సర్వే అండ్ ల్యాండ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు కోరారు. నందిపేట మండలం మల్లారం గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం భూభారతి రీసర్వే పైలట్ గ్రామంగా మల్లారంను ఎంపిక చేసిందని, 15 రోజుల తర్వాత ఫీల్డ్ సర్వే ప్రారంభిస్తామన్నారు. ఇళ్లు, గ్రామ కంఠం, ప్రభుత్వ భూముల వివరాలను నిర్ణయిచారని తెలిపారు. అనంతరం సర్వే నంబరు ప్రకారం సర్వే చేస్తారని పేర్కొన్నారు. రైతులు మోకాపై ఉన్న భూములను చూయించి, సర్వే సిబ్బందికి పట్టాపాసు బుక్కు జిరాక్స్ పత్రాలు అందజేయాల్సి ఉంటుందన్నారు. సర్వే అనంతరం జా బితాను గ్రామ పంచాయతీ, తహసీల్ కార్యాలయా ల్లో ప్రచురిస్తార ని వివరించారు. అభ్యంతరాలుంటే 60 రోజుల్లోపు అప్పీలు చేసుకునే అవకాశం కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మలైకా తబుస్సుం, తహసీల్దార్ సంతోష్ రెడ్డి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జగన్నాథం, సర్వేయర్లు పాల్గొన్నారు.


