నిజామాబాద్ అర్బన్: నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ వెంకటేష్ శుక్రవారం తెలిపారు. నగరంలోని పూలాంగ్ సమీపంలో, బోధన్ బస్టాండ్‌లో గంజాయి విక్రయిస్తున్న షేక్ సమీర్, మహమ్మద్ రిజ్వాన్‌ను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. వారి వద్ద నుంచి 200 గ్రాముల ఎండు గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
కరెంట్ షాక్‌తో మేక మృతి
రెంజల్(బోధన్): మండలంలోని సాటాపూర్‌లో కరెంట్ షాక్ తగిలి మేక మృతిచెందింది. సాటాపూర్ గ్రామానికి చెందిన పెద్దసాయి భాగ్యలక్ష్మీ మేకల పెంపకం చేపడుతున్నారు. సాటాపూర్‌లోని పెట్రోల్ బంకు వద్ద ట్రాన్స్‌ఫార్మర్ విద్యుత్ తీగలకు మేక తగలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న స్థానిక పశువైద్యాధికారి విఠల్ మృతిచెందిన మేకను పరిశీలించారు. మేక విలువ సుమారు రూ. 13 వేల వరకు ఉంటుందన్నారు. అధికారులు న్యాయం చేయాలని కోరారు.


