ఆర్మూర్ పట్టణంలో..
నగరంలోని రహదారులు వర్షాపునీరు నిండి చెరువులను తలపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి నగరంలోని పలు రోడ్లన్నీ వర్షపునీటితో నిండిపోయాయి. దీంతో మురికినీరు కూడా బయటకు వచ్చి రోడ్లపై నిలిచాయి. వాహనదారులు, పాదచారులు వర్షపు నీటిలోనే నడుచుకుంటు ఇబ్బందులు పడుతూ ప్రయాణాలు సాగించారు. చిన్నపాటి వర్షానికే ప్రధాన రోడ్లపై వర్షపునీరు అగితే భారీ వర్షాలకు రోడ్లు జలమయంగా మారుతాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. –సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
వర్షపు నీటిలో నడుచుకుంటూ వస్తున్న మహిళలు
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని హుస్నాబాద్ కాలనీలో రహదారి పూర్తిగా అధ్వాన్న స్థితికి చేరింది. వర్షం పడితే చాలు రోడ్డంతా నీరు నిలిచిపోతూ, బురదమయంగా మారుతోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే అంబేడ్కర్ చౌరస్తా వద్ద వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.


