బాలికలు క్రీడల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

బాలికలు క్రీడల్లో రాణించాలి

Jul 4 2026 2:49 AM | Updated on Jul 4 2026 2:49 AM

సీపీ సాయిచైతన్య

నగరంలో సబ్‌ జూనియర్‌ గర్ల్స్‌

ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభం

నిజామాబాద్‌ అర్బన్‌ : బాలికలు విద్యతోపాటు క్రీడల్లో రాణించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నా రు. క్రీడలు శారీరక దారుఢ్యాన్ని, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. నగరంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో తెలంగాణ సబ్‌ జూనియర్‌ గర్ల్స్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ క్రీడలు ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి మంచి పేరు తీసుకురావాలన్నారు. గెలుపొటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తితో ఆడాలన్నారు. క్రమశిక్షణ తో వ్యవహరించడం ద్వారా ఉన్నత శిఖరాలను అధి రోహించవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సహించాలన్నారు. పోటీలలో నిజామాబాద్‌, కరీంనగర్‌, సిద్దిపేట, మె దక్‌, నల్లగొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్‌, మహబూ బ్‌నగర్‌, వనపర్తి, వరంగల్‌ తదితర జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నగర మేయర్‌ ఉమారాణి, జిల్లా క్రీడల శాఖ అధికారి పవన్‌కుమార్‌, జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ సెక్రెటరీ, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement