కల్లులో మద్యం కలుపుకొని తాగి ఒకరి మృతి? | - | Sakshi
Sakshi News home page

కల్లులో మద్యం కలుపుకొని తాగి ఒకరి మృతి?

Jul 4 2026 2:49 AM | Updated on Jul 4 2026 2:49 AM

మరొకరి పరిస్థితి విషమం..

బోధన్‌ టౌన్‌(బోధన్‌): పట్టణ శివారులో ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందగా, ఘ టన స్థలంలో కల్లు, మద్యం బాటిళ్లు ఉండటంతో రెండు క లుపుకొని తాగి మృతిచెందిన ట్లు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన నీరడి విఠల్‌(45), అదే గ్రామానికి చెందిన జుడలి లక్ష్మయ్య ఇద్దరు వ్యవసాయ కూలీ పని చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు కలిసి శుక్రవారం మధ్యాహ్నం నర్సాపూర్‌ గేట్‌, నిజామాబాద్‌ మెయిన్‌ రోడ్డు పక్కన గల కల్లు దుకాణంలో కల్లు తీసుకొని సమీపంలోని చెట్ల చాటున కూర్చొని తాగారు. కొద్దిసేపటికి విఠల్‌, లక్ష్మయ్య అపాస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గమనించి వారిని పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి విఠల్‌ మృతి చెందాడని, లక్ష్మయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్‌లోని ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా అక్కడ కల్లు సీసాలతో పాటు మద్యం బాటిళ్లు ఉన్నాయి. దీంతో కిక్కు కోసం వారు కల్లులో మద్యం కలుపుకొని తాగారా, లేక ఇంకా ఏమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుమారుడు విలాస్‌ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement