వందశాతం అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

వందశాతం అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దాలి

Jul 4 2026 2:07 AM | Updated on Jul 4 2026 2:07 AM

నిజామాబాద్‌ అర్బన్‌ : చదువు నేర్చుకోలేని, చదు వు మధ్యలో మానేసిన వయోజనులను గుర్తించి, వారికి చదువు ప్రాముఖ్యతను వివరించి అక్షరాస్యులుగా మార్చాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పేర్కొన్నా రు. జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘ఉల్లా స్‌ – అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి సిబ్బందికి ఉల్లాస్‌ యాప్‌పై శుక్రవారం ఓరియంటేషన్‌ తరగతులు నిర్వహించారు. కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నిజామాబాద్‌ను 100 శాతం అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. ఇప్పటికే గుర్తించిన 6,776 మంది నిరక్షరాస్యులు, 497 వాలంటీర్‌ టీచర్లను ఉల్లాస్‌ యాప్‌లో నమోదు చేసి, లిటరసీ లెర్నింగ్‌ సెంటర్ల ద్వారా వారికి బోధన అందించి రానున్న ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ/ఎన్‌ఐవోఎస్‌ పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పురుషోత్తం, ఎంఈపీఎంఏ డీఎంసీ మాధురి, అకౌంట్స్‌ ఆఫీసర్‌ విజయ, ఏపీవోటీ అరుంధతి, జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్రస్థాయి రిసోర్స్‌ పర్సన్లు ఎం.సుమన్‌, ఎ. సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement