నిజామాబాద్ అర్బన్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై అధికారులతో సమీక్షించి పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామీ ణ ప్రాంతాల్లోని రైతులు యూరియా యాప్‌తో పడుతున్న ఇబ్బందులపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. నాణ్యమైన విత్తనా లను అందుబాటులో ఉంచడం, పంటల సాగు పై వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించాలి. వర్షా లు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణపై సమీక్షించాలి. ప్రధానంగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి సూపరింటెండెంట్ అందు బాటులో లేరు. ఇన్‌చార్జి సూపరింటెండెంట్ నాగమోహన్ ఇటీవల హైదరాబాద్‌కు బదిలీ కా గా, ఆయన స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితోపాటు ప్రా థమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, టీచర్ల కొరత, విద్యా బోధనను మెరుగుపర్చేందుకు అధికారులకు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది.
ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే
ఇందల్వాయి : రాష్ట్ర మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి శుక్రవారం ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లిలో పర్యటించారు. రూ.5 కోట్లతో నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారుల ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ సాయరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతల కిషన్ ఉన్నారు.
నేడు జిల్లాకు ఇన్‌చార్జి
మంత్రి సీతక్క రాక
ఇందల్వాయితోపాటు
నగరంలో పర్యటన
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
చేయనున్న మంత్రి


