● ప్రతి బస్సును తనిఖీ చేసిన తర్వాతే వినియోగించాలి
● ఆర్టీసీ జోనల్ ఈడీ సోలమన్
● నిజామాబాద్–2 డిపో, బస్టాండ్ల తనిఖీ
నిజామాబాద్ రూరల్ : ప్రయాణికుల భద్రతకు ఆర్టీ సీ అత్యంత ప్రాధాన్యమిస్తోందని జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్ పేర్కొన్నారు. నిజామాబాద్ బస్టాండ్, డిపో–2ను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిపో పరిధిలోని ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఆపరేషన్, ఛార్జింగ్ వ్యవస్థ భద్రతా చర్యలపై అధికారులతో సమీక్షించారు. రీజియన్‌లోని బోధన్, ఆర్మూర్, కా మారెడ్డి, బాన్సువాడ, నిజామాబాద్–1, 2 డిపోల పరిధిలో 89 ఎలక్ట్రిక్ బస్సులు ఉండగా, ప్రస్తుతం 35 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని అధికారులు వివరించా రు. సాంకేతిక సమస్యలతో ఇటీవల కరీంనగర్ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగిన ఘటన నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి బస్సును పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన అనంతరమే ప్రయాణికుల సేవలకు వినియోగించాలని, బ్యాటరీ, వైరింగ్, ఛార్జింగ్ వ్యవస్థ, ఉష్ణోగ్రత నియంత్రణ తదితర అంశాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం నిజామాబాద్ బస్ స్టేషన్‌లో ప్రయాణికులకు అందుతున్న సౌక ర్యాలు, బస్సుల రాకపోకలు, సమాచార బోర్డులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈడీ వెంట నిజామాబాద్ డిప్యూటీ ఆర్‌ఎం జ్యోతి, డిపో మేనేజర్లు, అధికారులు ఉన్నారు.


