● ఐదెకరాల వరకు డబ్బులు
జమ చేసిన ప్రభుత్వం
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో మూడో విడతగా మరో 16,759 మంది రైతులకు పంట పెట్టుబడి సాయం (రైతు భరోసా) అందింది. ఎకరానికి రూ.6 వేల చొప్పున మొత్తం రూ.44.3 కోట్లు బ్యాంకు ఖాతాల్లో శుక్రవా రం జమ అయినట్లు వ్యవసాయ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు జిల్లాలో 2,62,709 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.262.45 కోట్లు విడుదల చే సింది. గురువారం వరకు 4 ఎకరాల వరకు రైతులకు పెట్టుబడి సాయం అందగా, శుక్రవారం ఐదెకరాల వరకు విడుదల చేసింది.
స్కానింగ్ సెంటర్
యజమానికి టోకరా
● రూ.70 లక్షలు కాజేసిన ఉద్యోగులు
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ నగరంలోని ఖలీల్‌వాడీలోగల ఓ స్కానింగ్ సెంటర్ యజమానికి అందులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు రూ.70 లక్షలకు టోకరా వేశారు. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాక్లూర్ మండలంలోని మాణిక్‌బండార్‌కు చెందిన సత్యనారాయణతోపాటు మీనా అనే మహిళ నగరంలోని ఓ స్కానింగ్ సెంటర్‌లో పనిచేస్తున్నా రు. వీరు కొన్నేళ్లుగా నకిలీ నగదు రసీదులు సృష్టించి యాజమాన్యాన్ని మోసం చేస్తున్నారు. రోగులకు అసలు రసీదులు ఇస్తు న్నా.. దాని రికార్డు కాపీలో మాత్రం పరీక్షల వివరాలు, రుసుమును తక్కువగా చూపిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. దీనిని గుర్తించిన స్కానింగ్ సెంటర్ యాజమాన్యం ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆరేళ్లలో సుమారు రూ. 70 లక్షలకుపైగా న గదు కాజేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ డబ్బులతో సత్యనారాయణ అతడి భార్య పేరుతో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకుని నిందితుడు సత్యనారాయణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌హెచ్‌వో తెలిపారు. ఈ కేసులో మీనాతోపాటు మరో మహిళ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.
పోలీసుల
ప్రతిష్ఠ పెంచాలి
కమ్మర్‌పల్లి(బాల్కొండ): పోలీసుల ప్రతిష్ఠ పెంచేలా విధులు నిర్వర్తించాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయిచైతన్య సిబ్బందికి సూ చించారు. మెండోరా పోలీస్ స్టేషన్‌ను ఆయ న శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలిస్తూ విచారణలో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసుల ఛేదనకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని, ప్రతి కేసులో నాణ్యమైన విచారణ చేయాలని ఎస్సై సుహాసినికి సూ చించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలతో మమేకం కావాలని, గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచాలని పేర్కొన్నారు. సీపీ వెంట ఆర్మూర్ రూరల్ సీఐ జాన్‌రెడ్డి ఉన్నారు.


