వరదకాలువల్లో నీళ్లు నింపి ఆయకట్టుకు అందించాలి | - | Sakshi
Sakshi News home page

వరదకాలువల్లో నీళ్లు నింపి ఆయకట్టుకు అందించాలి

Jul 3 2026 9:32 AM | Updated on Jul 3 2026 9:32 AM

వరదకాలువల్లో నీళ్లు నింపి ఆయకట్టుకు అందించాలి నేడు రైతు ఉత్పత్తిదారుల సమావేశం

వేల్పూర్‌: వరదకాలువలో నీళ్లు నింపి వరదకాలువ ఆయకట్టుకు అందించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఇరిగేషన్‌ అఽధికారులను కోరారు. వేల్పూర్‌లోని తన క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఆయన జిల్లా ఇరిగేషన్‌ ఈఈ లాల్‌సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బాల్కొండ నియోజకవర్గంలో గాండ్లపేట్‌ వద్ద వరద కాలువ మరమ్మతులు దాదాపు పూర్తయినందున రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఆయకట్టు రైతాంగానికి సకాలంలో సాగునీరందించాలని కోరారు. దెబ్బతిన్న వరదకాలువ మరమ్మతు పనులు పూర్తయినందున సబ్‌ కాంట్రాక్టర్ల మధ్య నెలకొన్న చిన్నపాటి ఇబ్బందిని కాంట్రాక్టర్లతో మాట్లాడి పరిష్కరించాలన్నారు. అవసరమయితే తాను కూడా స్వయంగా పెద్ద కాంట్రాక్టర్లతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని వారు హామీ ఇచ్చారు. అలాగే ఈ సీజన్‌లో రైతులకు ఎలాంటి సాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

నిజామాబాద్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలోని గణేష్‌ భావర్‌ ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం రైతు ఉత్పత్తిదారుల 2వ వార్షికోత్సవ సమావేశం నిర్వహించనున్నట్లు రైతు ఉత్పత్తిదారుల గౌర అధ్యక్షుడు కొండెల సాయిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ నర్సింగరావు, చైర్మన్‌ వీఎఫ్‌పీసీఎల్‌ జైపాల్‌రెడ్డి, వాసుదేవరావు పీహెచ్‌పీసీఎల్‌ డైరెక్టర్లు హాజరవుతున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతు ఉత్పతిదారులు, రైతులు హాజరు కావాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement