గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య! | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య!

Jul 3 2026 9:32 AM | Updated on Jul 3 2026 9:32 AM

గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య! పిట్లంలో ఒకరు..

కామారెడ్డి క్రైం:రైలు కింద పడి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలోని బృందావన్‌ కాలనీ వద్ద గురువారం ఉదయం జరిగింది. రైలుపట్టాలపై మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచా రం ఇచ్చారు. రై ల్వే ఎస్సై లింబాద్రి, సిబ్బంది ఘట నా స్థలా న్ని పరిశీలించి విచారణ జరిపారు. మృతు డి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. కుడి చేతి కి వెండి కడియం, చేతిపై జె.నర్సింలు అని పచ్చబొ ట్టు, మెడలో రాగి తాయత్తు ఉన్నా యి. వయస్సు సుమారు 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు కామారెడ్డి రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.

పిట్లం(జుక్కల్‌): మండల కేంద్రంలోని ఓ అద్దె ఇంట్లో ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. పిట్లం మండలంలోని అంభం గ్రామానికి చెందిన ఇందూరి సన్నీ (17) మండల కేంద్రంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటూ, స్థానికంగా ఉన్న ఓ టిఫిన్‌ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. గురువారం అతడు అద్దె ఇంట్లో తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి తల్లి సవిత తన కుమారుడి మృతిపై ఎలాంటి అనుమానం లేదని ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement