నాలుగు జాతులే ప్రమాదకరం.. | - | Sakshi
Sakshi News home page

నాలుగు జాతులే ప్రమాదకరం..

Jul 3 2026 9:32 AM | Updated on Jul 3 2026 9:32 AM

మన ప్రాంతంలో దాదాపు 40 రకాల పాములు కనిపిస్తుంటాయి. వీటిలో 60 శాతం విషపూరితం కానివే (జెర్రిపోతు, నీటి పాము, పసరిక పాము, ఇసక పొడపాము మొదలైనవి) ఉంటాయని వైద్యులు అంటున్నారు. అయితే అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పాములుగా బిగ్‌ ఫోర్‌ అని పిలువబడే నాలుగు జాతులు మన ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తుంటాయి.

త్రాచుపాము: అత్యంత విషపూరితమైనది, పడగ విప్పి భయపెడుతుంది. మన ప్రాంతంలో తరుచుగా ఈ పాము కాటుకే ప్రజలు బలవుతారు. విషం నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

కట్ల పాము: అత్యంత ప్రమాదకరమైన పాము, నాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే విషాన్ని కలిగి ఉంటుంది. రాత్రి వేళల్లో ఎక్కువగా సంచరిస్తుంది. ఈ పాము కాటు వేసినప్పుడు మొదట నొప్పి తక్కువగా ఉంటుంది.

రక్తపింజర: ఇది చాలా విషపూరితమైన పాము, శరీరంపై గొలుసు ఆకారపు మచ్చలు ఉంటాయి. పెద్దగా బుసలు కొడుతుంది. ఈ పాము కాటుతో రక్తం గడ్డకట్టే వ్యవస్థ దెబ్బతింటుంది. పొలాలు, గడ్డి ప్రాంతాల్లో కనిపిస్తుంది

పొడపాము లేదా సుడి జెముడు: ఇది చాలా చి న్నగా కనిపిస్తుంది. గ్రామాలలో దీనిని పొ డపాము అంటా రు. ఇది చాలా విష పూరితమైనది. పొడి ప్రాంతాల్లో, మైదానాల్లో, బంజరు భూముల్లో కనిపిస్తుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement