ప్రతి కుటుంబానికి ఆర్థికాభివృద్ధిపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి కుటుంబానికి ఆర్థికాభివృద్ధిపై అవగాహన కల్పించాలి

Jul 3 2026 9:32 AM | Updated on Jul 3 2026 9:32 AM

డిచ్‌పల్లి: ప్రతి కుటుంబానికి ఆర్థికాభివృద్ధిపై అవగాహన కల్పించాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) రాష్ట్ర ప్రాజెక్ట్‌ మేనేజర్‌ నరసింహ స్వామి సూచించారు. డిచ్‌పల్లిలోని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో గురువారం ఐకేపీ సీఆర్పీ అభ్యర్థులకు ఇస్తున్న శిక్షణ తీరును ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ సంఘాల సమావేశాలకు వెళ్లి ఆర్థిక అక్షరాస్యత గురించి మహిళలందరికీ అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సంస్థలో శిక్షణ పొందుతున్న టైలరింగ్‌, మగ్గం వర్క్‌, బ్యూటీ పార్లర్‌ కోర్సుల అభ్యర్థులతో మాట్లాడి శిక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు. సంస్థ డైరెక్టర్‌ రవికుమార్‌, డీపీఎం సంధ్యారాణీ, ఏపీఎం రవీందర్‌ రెడ్డి, సీసీలు, శిక్షణ బృందం రామకృష్ణ, భాగ్యలక్ష్మీ, నవీన్‌, లక్ష్మీనారాయణ, ఫరీదా, నాగలక్ష్మి, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement