రీడింగ్‌ రూం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రీడింగ్‌ రూం ప్రారంభం

Jul 3 2026 9:32 AM | Updated on Jul 3 2026 9:32 AM

రీడింగ్‌ రూం ప్రారంభం

ఖలీల్‌వాడి: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం నగరంలోని పెన్షనర్స్‌ అసోసియేషన్‌ భవనంలో ప్రత్యేక రీడింగ్‌ రూమ్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతరెడ్డి రాజిరెడ్డి, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పండరినాథ్‌, కార్యదర్శి గంగా కిషన్‌ ప్రారంభించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి అనుబంధంగా గ్రంథాలయానికి సమీపంగా ఉన్న ఈ భవనాన్ని పాఠకుల కోసం కేటాయించినందుకు పెన్షనర్‌ అసోసియేషన్‌ కార్యవర్గానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పెన్షనర్‌ అసోసియేషన్‌ సలహాదారులు రాజారామ్‌, గ్రంథాలయ సిబ్బంది ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement