సేంద్రియ సాగుపై దృష్టిసారించాలి | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ సాగుపై దృష్టిసారించాలి

Jul 3 2026 9:32 AM | Updated on Jul 3 2026 9:32 AM

రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను అందజేస్తున్నాం

జిల్లా కోఆపరేటివ్‌ అధికారి శ్రీనివాస్‌రావు

నిజామాబాద్‌ రూరల్‌: రైతులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని సాగుచేయాలని జిల్లా కో–ఆపరేటివ్‌ అధికారి శ్రీనివాస్‌రావు అన్నారు. మండలంలోని మాధవనగర్‌ వ్యవసాయ సహకార సంఘంలో గురువారం ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. గత నెల 29 నుంచి ఈనెల 6 వరకు సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సహకార సంఘాల బలోపేతానికి జిల్లాలో అనేక గిడ్డంగులు నిర్మాణం చేపట్టామన్నారు. నాబార్డు నిధులతో జిల్లాలో 100 నుంచి 200 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగుల నిర్మాణం చేపట్టి రాష్ట్రంలోనే మొట్టమొదటి జిల్లాగా పేరుపొందామన్నారు. 2500 నుంచి 10,000 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంగల గిడ్డంగుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయానికి మొగ్గుచూపాలని, ఆర్గానిక్‌ ఫర్టిలైజర్స్‌ అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మాధవనగర్‌ సహకార కోఆపరేటివ్‌ సంఘానికి ఎఫ్‌పీవో (రైతు ఉత్పిత్తదారుల సంస్థల ప్రోత్సహం) గుర్తింపు రావడం అభినందనీయమన్నారు. చైర్మన్‌ నాగేశ్వరరావు, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ సరస్వతి, మానిటరింగ్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, అజయ్‌ కుమార్‌, ఉప్పలపు పోతారెడ్డి, కేశపూర్‌ సర్పంచ్‌ తేకుర్తి గంగారెడ్డి, సంఘ కార్యదర్శి వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement