న్యూస్‌రీల్
2025 నుంచి ఈ ఏడాది జూన్ వరకు నమోదైన కేసులు
నిజామాబాద్
● ఓ వైపు ఏసీబీ దూకుడు..
● మరోవైపు కొనసాగుతున్న విచారణ
● ఏడాదిన్నరలో 12 కేసులు
● ఒక్క కేసులోనూ ఖరారు కాని శిక్షలు
● జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి
కాటు కాలం.. అప్రమత్తత అవసరం
ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పాము కాటు ప్రమాదాల నుంచి రక్షించుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.
శుక్రవారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2026
– 8లో u
మరో 26వేల మంది
రైతులకు ‘భరోసా’
● నాలుగు ఎకరాల వరకు
అందజేసిన ప్రభుత్వం
డొంకేశ్వర్(ఆర్మూర్):జిల్లాలో మరో 26,058 మంది రైతులకు పంట పెట్టుబడి సాయం (రైతు భరోసా) అందింది. వీరికి ఎకరానికి రూ.6 వేల చొప్పున మొత్తం రూ.53.92 కోట్లు బ్యాంకు ఖాతాల్లో గురువారం జమయ్యాయి. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఇప్పటి వరకు జిల్లాలో 2,45,950 మంది రైతులకు గాను రూ.218.15 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం ఇప్పటి వరకు 4 ఎకరాల వరకు రైతులకు పెట్టుబడి సాయం అందగా, ఆపైబడిన ఎకరాలకు కూడా విడతల వారీగా ప్రభుత్వం ఇవ్వనుంది.
13 నుంచి అల్బెండజోల్ మాత్రలు పంపిణీ
● డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ
సుభాష్‌నగర్: జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఈ నెల 13 నుంచి జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్ల పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామని డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ తెలిపారు. నులి పురుగుల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై జిల్లాస్థాయి శిక్షణా కార్యక్రమాన్ని గురువారం జిల్లా కేంద్రం నుంచి జూమ్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రా లు, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళా శాలలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, కళాశాలల్లో, వసతిగృహాల్లో అల్బెండజోల్ మాత్రలు అందిస్తారని పేర్కొన్నారు. పిల్లలందరికీ మాత్రలు వేయించాలని సూ చించారు. ఎవరైనా పిల్లలు అనారోగ్యం, మరేతర కారణాలతో మాత్రలు వేసుకోకపోతే మలి విడత ఈ నెల 20న తప్పనిసరిగా వేయించుకోవాలని తెలిపారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి అశోక్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ నవ్య, డిప్యూటీ డీఎంహెచ్‌వో సికందర్ నాయక్, ప్రోగ్రాం అధికారులు శిఖర, నవ్య, శ్రావ్య, ఆర్‌బీఎస్‌కే మేనేజర్ సచిన్, డీపీవో విశాలరాణి, డీహెచ్‌ఈ ఘన్‌పూర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
భూముల రీ సర్వేకు సహకరించాలి
డొంకేశ్వర్(ఆర్మూర్): భూముల రీ సర్వేకు సహకరించాలని జిల్లా సర్వే ల్యాండ్ ఏడీ శ్రీనివాసులు కోరారు. మండలంలోని కోమట్‌పల్లిలో భూముల రీ సర్వేపై రెవెన్యూ, స ర్వే ల్యాండ్ అధికారులతో కలిసి గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రా మాల్లో వందేళ్ల క్రితం నిజాంకాలం నాటి స ర్వే రిపోర్టుల ఆధారంగా మ్యాపులు, సర్వే నంబర్లు ఉన్నాయని, వీటిని ఆధునికరించేందుకు ప్రభుత్వం రీ సర్వే చేయనున్నట్లు తెలిపారు. ముందుగా గ్రామ సరిహద్దును నిర్ణయిస్తామని, ఆ తర్వాత ఇళ్లు, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, వ్యవసాయ, ఆబాది భూములకు సర్వే చేస్తామన్నారు. త్వరలో ప్రారంభం కానున్న సర్వేకు గ్రామస్తులు, రైతులు సహకరించాలని కోరారు. సర్పంచ్ సుమలత, తహసీల్దార్ ప్రసాద్, ఆర్‌ఐ నితీశ్, సర్వేయర్లు పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్ : లంచావతారాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఏసీబీ.. అదే దూకుడుతో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతున్న వారిపైనా నిఘా సారించింది. సుమారు ఏడాదిన్నర కాలంలో ఏడు ప్రభుత్వ శాఖలపై దాడులు చేసి 12 కేసులు నమోదు చేసింది. అయితే ఏసీబీకి చిక్కిన సమయంలో నెలకొన్న హడావుడి ఆ తరువాత కనిపించడం లేదు. కేసు పరిధి ఏసీబీ నుంచి కోర్టుకు చేరిన తరువాత సాక్ష్యాధారాలు సమర్పించడం, నేరాన్ని రుజువు చేయడంలో నిబంధనలకు అనుగుణంగా వెళ్లే క్రమంలో కొంత ఆలస్యం జరుగుతుండడంతో అవినీతి అధికారులు ‘చిక్కినా చింత లేదు’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. కొంత మందైతే జైలు నుంచి బయటికి వచ్చి తమ పలుకుబడిని ఉపయోగిస్తూ అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారనే ఆరోపణలున్నాయి. లంచం, ఆదాయానికి మించి ఆస్తుల కేసులు రుజువు చేసేందుకు సుమారు ఏడాది నుంచి మూడేళ్లు పడుతోందని ఓ అధికారి అన్నారు.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లో 2025 జనవరి నుంచి ఈ ఏడాది జూన్ వరకు 12 ఏసీబీ కేసులు నమోదయ్యా యి. లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన కేసుల్లో ఇప్పటివరకు రూ.3,59,500 నగదు స్వాధీనం చేసుకు న్నారు. అలాగే ఇటీవల ఏసీబీ అధికారులు ఎకై ్స జ్ శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇంటితోపా టు కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి రూ.1.33 లక్షలు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. లింగంపేట పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు ఎస్సై లు, బిచ్కుంద ఎకై ్సజ్ సీఐ ఏసీబీకి చిక్కారు. అలాగే వర్ని ఎస్సై, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బిల్ కలెక్టర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
తనిఖీలతో హడల్..
లంచం డిమాండ్ చేస్తున్న అధికారులను వల వేసి పట్టుకుంటున్న ఏసీబీ అధికారులు ప్రభుత్వ కా ర్యాలయాల్లో తనిఖీలతో హడలెత్తిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రెండుసార్లు తనిఖీలు ని ర్వహించారు. కొన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించి వివరాలను ఉన్నతాధికారులకు పంపించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలోని రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాలతోపాటు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. అలాగే విద్యాశాఖ పరిధిలోని కస్తూర్బాగాంధీ విద్యాలయా ల్లో నిధుల దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు రావడంతో వివరాలు తెలుసుకున్నారు. మీ సేవ కేంద్రాలు, రైస్ మిల్లుల్లోనూ తనిఖీలు చేశారు.
మల్లారెడ్డి లాకర్‌లో కిలో బంగారం
నిజామాబాద్ అర్బన్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి బ్యాంక్ లాకర్ నుంచి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు ఎకై ్సజ్ కార్యాలయంతోపాటు నిజామాబాద్ నగరంలోని మల్లారెడ్డి ఇంట్లో గత నెలలో సోదాలు నిర్వహించి రూ.3 కోట్లకుపైగా ఆస్తులను గుర్తించారు. రెండు రోజుల క్రితం మూడు లాకర్‌లను తెరిచి కిలో బంగారం, 70 తులాల వెండిని గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపారు.
అవినీతి నిరోధకశాఖ లంచావతరాలను, దోచుకుంటూ దాచుకుంటున్న వారిని వలపన్ని పట్టుకుంటున్నా కేసు నేర నిరూపణ దశకు చేరుకునేందుకు చాలా సమయం పడుతోంది. ఏసీబీకి పట్టుబడి జైలుకు వెళ్లి బయటికి వచ్చిన వారు కొందరు తమ పలుకుబడిని ఉపయోగించి కేసులను సాగదీయడం, సాక్షులు మాట మార్చడం, దర్యాప్తులో జాప్యం, ప్రభుత్వం నుంచి అనుమతులు వంటి కారణాలు నిందితులకు శిక్ష ఖరారుకావడంలో ఆలస్యానికి కారణమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు ఏడాదిన్నర కాలంలో 12 కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకు ఒక్కరికి కూడా శిక్ష ఖరారు కాలేదు.


