ఎన్నారైల సంక్షేమానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

ఎన్నారైల సంక్షేమానికి పెద్దపీట

Jul 3 2026 1:10 AM | Updated on Jul 3 2026 1:10 AM

నిజామాబాద్‌అర్బన్‌: విదేశాల్లో ఉద్యోగాలు చేయాలంటేనే భయాందోళనకు గురికావొద్దని, ప్రభుత్వం ప్రవాస భారతీయుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. టామ్‌కామ్‌ సౌజన్యంతో జిల్లా శిక్షణ ఉ పాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విదేశీ ఉద్యోగ మేళాను ఎమ్మె ల్యే జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం స్కిల్‌ యూనివర్సి టీని సైతం ఏర్పాటు చేసిందన్నారు. గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం నూతన పాలసీని రూపొందించనుందన్నారు. నిజామాబాద్‌లో భారీ స్థాయిలో విదేశీ ఉద్యోగ మేళా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నగర మేయర్‌ ఉమారాణి, ఉపాధి కల్పన శాఖ డైరెక్టర్‌ కాంతి వెస్లీ, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియా మక పత్రాలు అందజేశారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి వేల్పుల విజేత, జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి పవన్‌కుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, అధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

7,500 మంది..

ఉద్యోగ మేళాకు 7,500 మంది యువత హాజరైనట్లు ఉపాధికల్పన అధికారి విజేత తెలిపారు. 42 మంది విదేశీ ఉద్యోగాలకు ప్రా థమికంగా ఎంపిక కాగా, 1750 మంది స్థానిక ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైనట్లు వివరించారు.

విదేశీ ఉద్యోగ మేళా నిర్వహణ

అభినందనీయం

రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి

హాజరైన ఉపాధి కల్పన శాఖ డైరెక్టర్‌ కాంతి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement