● ఆర్‌ఎం ఎస్‌వీజీ కృష్ణమూర్తి
నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్–హైదరాబాద్–బెంగళూరు లహరి ఏసీబస్సు సర్వీసుకు కొత్త బోర్డింగ్ పాయింట్లను అందుబాటులోకి తీసుకువచ్చామని టీజీఎస్‌ఆర్టీసీ రీ జినల్ మేనేజర్ ఎస్‌వీజీ కృష్ణమూర్తి పేర్కొన్నారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బెంగళూరు ప్ర యాణికుల అభ్యర్థన మేరకు హైదరాబాద్ నగరంలో లహరి బస్సు సర్వీసుకు మేడ్చల్, కోంపల్లి, జేబీఎస్, ఎంజీబీఎస్, ఆరాంఘర్ ‘ఎక్స్’ రోడ్, శంషాబాద్ ప్రాంతాలను కొత్త బోర్డింగ్ పాయింట్లుగా ఏర్పాటు చేశామన్నారు. బెంగళూరు నుంచి నిజామాబాద్ వచ్చే సర్వీసుకు పిణ్య, యశ్వంత్‌పూర్, ఆనంద్ రావు నగర్, ప్యాలెస్ గుట్టహళ్లి, సీబీఐ–జంక్షన్, బెంగళూరు– విమానాశ్రయం ఎక్స్ రోడ్‌లను కొత్త బోర్డింగ్ పాయింట్లుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా లహరి సర్వీసును వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. సంస్థ వెబ్‌సైట్ www.tgs rtcbus.in ద్వారా లేదా రిజర్వేషన్ కౌంటర్‌లో ముందస్తుగా టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం ఉందని తెలిపారు.


