జీజీ కాలేజీలో ‘అన్న–అక్క మెంటార్‌షిప్‌’ | - | Sakshi
Sakshi News home page

జీజీ కాలేజీలో ‘అన్న–అక్క మెంటార్‌షిప్‌’

Jul 2 2026 3:05 AM | Updated on Jul 2 2026 3:05 AM

ఖలీల్‌వాడి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్‌ విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘అన్న–అక్క మెంటార్‌ షిప్‌’ కార్యక్రమాన్ని నగరంలోని గిరిరాజ్‌ కాలేజీలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామ్మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై 1 నుంచి సెప్టెంబర్‌ 5వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కార్యక్రమం అమలవుతుందని, రాష్ట్రంలోని 150 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు చెందిన 53 వేల మంది డిగ్రీ మూడో సంవత్సరం విద్యార్థులు (మెంటార్లుగా) 9 వేల పా ఠశాలల్లో విద్యార్థులకు 30 గంటలపాటు శిక్షణ ఇస్తారని తెలిపారు.కార్యక్రమ కళాశాల సమన్వయకర్తలు కిరణ్‌ కుమార్‌గౌడ్‌, వివేకానంద, సుమన్‌, మాట్లాడుతూ.. డిగ్రీ కళాశాలల విద్యార్థులను ‘మెంటార్లు’గా మార్చి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సరికొత్త సాంకేతికతను అందించడం ‘అన్న–అక్క మెంటార్‌షిప్‌’ కార్యక్రమ ముఖ్య ఉద్దే శమన్నారు. మెంటార్‌షిప్‌లో విజయవంతంగా బోధన పూర్తి చేసిన డిగ్రీ విద్యార్థులకు అకడమిక్స్‌ లో రెండు ప్రత్యేక క్రెడిట్‌లను కేటాయిస్తారని తెలిపారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎస్‌ రంగరత్నం, వినయకు మార్‌, దండు స్వామి, రామస్వామి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement