బీజేపీ అనుబంధ సంస్థగా ఎన్నికల కమిషన్‌ | - | Sakshi
Sakshi News home page

బీజేపీ అనుబంధ సంస్థగా ఎన్నికల కమిషన్‌

Jul 2 2026 3:05 AM | Updated on Jul 2 2026 3:05 AM

రుద్రూర్‌(బోధన్‌)/పెర్కిట్‌(ఆర్మూర్‌)/బాన్సువాడ: కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్‌ విమర్శించారు. బుధవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించిన ఆయన రుద్రూర్‌ మండలం ఎత్తొండ, ఆర్మూర్‌ పట్టణంలో నిర్వహించిన పలు ప్రైవేట్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాన్సువాడలో ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయా చోట్ల ఆయన మీడియాతో మా ట్లాడారు. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో బీజే పీ తమ వ్యతిరేకులనే కారణంతో ఎస్‌ఐఆర్‌ ప్రక్రి య ద్వారా లక్షలాది మంది ఓట్లను తొలగించి ఫలితాలను తారుమారు చేసిందని ఆరోపించారు. తెలంగాణలో అలా జరగకుండా కాంగ్రెస్‌ ఎస్‌ఐఆర్‌ను పర్యవేక్షిస్తోందన్నారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విభజన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో కుమ్మక్కు కావడం వల్లే 8 ఎంపీ స్థానాలు వచ్చాయి తప్పా తెలంగాణలో బీజేపీకి ప్రజాదరణ లేదన్నారు.

గ్రామ దేవతల ఉత్సవాలకు ప్రాధాన్యం

గ్రామాల్లో ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించే గ్రామ దేవతల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఎత్తొండలోని రేణుకాఎల్లమ్మ దేవి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ సురేశ్‌షెట్కార్‌, ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కాసుల బాలరాజు, రాష్ట్ర కల్లు గీత కార్మిక సహకార కార్పొరేషన్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

ఆర్టీసీ విలీనం అప్పుడే..

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. యూనియన్లు, ఆర్టీసీ అధికారులతో చర్చించి విధి విధానాలు ఖరారు చేశాకే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement