ఎన్యుమరేషన్‌ ఫామ్‌ల పంపిణీ 95 శాతం పూర్తి | - | Sakshi
Sakshi News home page

ఎన్యుమరేషన్‌ ఫామ్‌ల పంపిణీ 95 శాతం పూర్తి

Jul 2 2026 3:05 AM | Updated on Jul 2 2026 3:05 AM

ఓటర్లకు సహకరించేందుకు వీలుగా హెల్ప్‌డెస్క్‌లు

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

హెల్ప్‌ డెస్క్‌ ఆకస్మిక తనిఖీ

సుభాష్‌నగర్‌: జిల్లావ్యాప్తంగా ఎన్యుమరేషన్‌ ఫామ్‌ ల పంపిణీ 95 శాతం పూర్తికాగా, నిజామాబాద్‌ నగరంలో 65 శాతం పూర్తయ్యిందని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈనెల 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే ప్రక్రియ కొనసాగుతుందని, ప్రతి ఓటరు గ డువులోపు ఫారాలు పూరించి బీఎల్‌వోలకు అందించాలని అన్నారు. నిజామాబాద్‌ నగర కార్పొరేషన్‌ పరిధిలోని కంఠేశ్వర్‌ జోన్‌ –4 కార్యాలయంలో కొనసాగుతున్న హెల్ప్‌డెస్క్‌ కేంద్రాన్ని బుధవారం సా యంత్రం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీచేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్‌, వివరా ల నమోదు విషయంలో ఓటర్లకు ఈ కేంద్రం ద్వా రా అందిస్తున్న సేవలు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనకు చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్ర క్రియకు ప్రతి ఓటరు సహకరించాలని సూచించా రు. ఆన్‌లైన్‌లో ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఓటర్లు తమ వివరాలు పరిశీలించుకోవచ్చన్నారు. కాగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించి ప్ర జలు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని, ఎన్యుమరేషన్‌ ఫారంలో వివరాలు సరిగా లేని వారికి సైతం ఈనెల 24 తర్వాత ఈఆర్‌వోలు నోటీసులు అందించి హియరింగ్‌ నిర్వహిస్తారని తెలిపారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి అర్హత కలిగిన వారి పేర్లను ఓటరు జాబితాలో చేర్చను న్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు ఆ యా రాజకీయ పార్టీల బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు తమవంతు సహకారం అందించాలని సూచించారు. ఓటర్ల నుంచి బీఎల్‌ఏలు ప్రతిరోజు 50 వరకు ఎన్యూమరేషన్‌ ఫారాలు సేకరించి బీఎల్‌ఓలకు అందించవచ్చని అన్నారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, అధికారులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement