బాబ్లీ 14 గేట్ల ఎత్తివేత | - | Sakshi
Sakshi News home page

బాబ్లీ 14 గేట్ల ఎత్తివేత

Jul 2 2026 3:05 AM | Updated on Jul 2 2026 3:05 AM

కమ్మర్‌పల్లి(బాల్కొండ): గోదావరి నదిపై మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ తాలూకాలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు బుధవారం తెరుచుకున్నాయి. పోచంపాడ్‌ డివిజన్‌ నుంచి ఏఈఈలు కొత్త రవి, ఎన్‌. శ్యామ్‌కుమార్‌, ఎస్‌ విన్యాస్‌రెడ్డి ఉదయం బాబ్లీ ప్రాజెక్టు వద్దకు చేరుకోగా, వారి సమక్షంలో మహారాష్ట్ర ఇరిగేషన్‌ అధికారులు గేట్లను ఎత్తి నీటిని వదిలారు. గురువారం సాయంత్రానికి ఎస్సారెస్పీలోకి నీరు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్‌ 28 వరకు ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంచనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఏడాది జూలై 1 నుంచి అక్టోబర్‌ 28వ తేదీ వరకు గేట్లను తెరిచి ఉంచుతారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 15.149 టీఎంసీల(1064.30 అడుగులు) నీరు నిల్వ ఉండగా, గతేడాది ఇదే రోజున 15.672 టీఎంసీల (1064.70 అడుగులు) నీరుంది.

కోర్టు భవన నిర్మాణ పనుల పరిశీలన

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): భీమ్‌గల్‌ పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న కోర్టు భవనాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి బుధవా రం పరిశీలించారు. పనులను వీలైనంత త్వ రగా పూర్తి చేస్తే ప్రారంభోత్సవ తేదీని హైకోర్టుకు నివేదిస్తామని న్యాయమూర్తి అన్నారు. ఆర్మూర్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీదేవి, ఎంపీడీవో సంతోష్‌కుమార్‌, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ప్రవీణ్‌ చందర్‌, ట్రెజరర్‌ రాజేందర్‌, న్యాయవాదులు శ్యామ్‌, సంజీవ్‌, కిరణ్‌, చైతన్య, నాగేందర్‌ తదితరులు ఉన్నారు.

భూభారతి రీ సర్వేకు సహకరించాలి

పెర్కిట్‌(ఆర్మూర్‌): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రీ సర్వేకు రైతులు, ప్రజలు సహకరించాలని జిల్లా భూ మి, కొలతల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ కోరారు. ఆర్మూర్‌ మండలం రాంపూర్‌లో బుధవారం భూభారతి రీ సర్వేపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాంపూర్‌ గ్రా మాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకుని రీ సర్వే చేస్తున్నట్లు వెల్లడించారు. రాంపూర్‌ గ్రామ శి వారులోని వివిధ సర్వే నంబర్లలో ఉన్న భూ మిని పది రోజుల్లో సర్వేయర్లు రీ సర్వే చేస్తారని, రైతులు సహకరించాలని కోరారు. ని జామాబాద్‌ హెడ్‌ క్వార్టర్స్‌ డీఐ జగన్నాథం, ఆర్మూర్‌ డీఐ శేఖర్‌ వర్మ, బోధన్‌ డీఐ దత్తు, సర్వేయర్‌ రత్నాకర్‌, సర్పంచ్‌ శూలం లావణ్య, జీపీవో తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement