డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో చిన్న, సన్న కారు రైతాంగానికి ఖరీఫ్ సీజన్ పంట పెట్టుబడి సాయం అందింది. రైతు భరోసా నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంతో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. తొలి విడతగా మూడెకరాల లోపు భూమి కలిగిన రైతులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ఈ నిధులను విడుదల చే సింది. బుధవారం వరకు ఎకరానికి రూ.6వేల చొప్పున జిల్లా వ్యాప్తంగా 2,19,892 మంది రైతుల ఖాతాల్లో రూ.164.23 కోట్ల నిధులు డిజిటల్ పద్ధతిలో (డీబీటీ) జమ అయినట్లు జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి వెల్లడించారు. భరోసా నిధులు జమ అయినట్లు సెల్‌ఫోన్‌లకు సందేశాలు వస్తుండడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ప్రస్తు తం ఖరీఫ్ సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో పంట పెట్టుబడి సాయం అందడంపై సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విత్తనా లు, ఎరువుల కొనుగోళ్లకు, కూలీల ఖర్చులకు ఆర్థి కంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, అ ప్పుల బాధల నుంచి కొంత ఉపశమనం లభించిందని జిల్లా రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మూడెకరాలు పైబడిన వారికి కూడా ప్రభు త్వం విడతల వారీగా భరోసా నిధులు ఇవ్వనుంది.
నియోజకవర్గాల వారీగా వివరాలు
మూడు ఎకరాల వరకు అందిన
పెట్టుబడి సాయం
జిల్లాలోని 2,19,892 మంది
అన్నదాతలకు..
రూ.164.23 కోట్లు జమ


