ఐడీవోసీలో రూఫ్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్‌లు | - | Sakshi
Sakshi News home page

ఐడీవోసీలో రూఫ్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్‌లు

Jul 2 2026 3:05 AM | Updated on Jul 2 2026 3:05 AM

నిజామాబాద్‌ రూరల్‌ : భూగర్భ జలాలను పెంపొందించేలా జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రూఫ్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్‌లను నిర్మించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఉన్న జిల్లా పంచాయతీ రీసోర్స్‌ సెంటర్‌ భవనంలోని రూఫ్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్‌ను కలెక్టర్‌ బుధవారం పరిశీలించారు. ఏ మేరకు భూగర్భ జలాలు వృద్ధి చెందాయి, నిర్మాణానికి అయిన వ్యయం ఎంత తదితర వివరాలను ఆరా తీశారు. ఇదే తరహాలో ఐడీవోసీలోనూ అనుకూలమైన చోట రూఫ్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్‌లను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వాటర్‌ హార్వెస్టింగ్‌ నిర్మాణాల వల్ల వర్షపు నీరు వృధా కాకుండా భూగర్భ జలాలు ఎంతో వృద్ధి చెందుతాయని అన్నారు. కలెక్టర్‌ వెంట నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సాయాగౌడ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement