● ఐదుగురికి గాయాలు
డిచ్‌పల్లి : మండలంలోని సాంపల్లి శివారు 44వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాల య్యాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలూరు మండలం రాంచంద్రాపల్లి గ్రామాని కి చెందిన మహిళలు ఆటోలో ఇందల్వాయి మండలం వచ్చి సాయంత్రం తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. సాంపల్లి క్రాస్‌రోడ్డు వద్దకు రాగానే ముందు వెళుతున్న బైక్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. దీంతో బైక్‌ను తప్పించబోయి ఆటో రహదారిపై ఉన్న డివైడర్‌ను ఢీకొని పక్కకు ఒరిగింది. దీంతో ఆటోలో ఉన్న మహిళల్లో ఐదుగురు గాయపడ్డారు. ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి సైతం గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డిచ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ అర్బన్ : నగరంలోని 5వ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి రేణుకానగర్ కాలనీ కట్టమైసమ్మ ఆలయంలో మంగళవారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో చొరబడిన దొంగలు హుండీలోని రూ. 6000, నగలు, అమ్మవారి రోల్డ్ గోల్డ్ నగలు అపహరించినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. ఆలయ చైర్మన్ నరేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


