నిజామాబాద్ రూరల్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయాలని, ఫీజు బకాయిలు చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ డిమాండ్ చేశారు. నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష విద్యార్థి సంఘాలతో మద్దతుతో గురువారం ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ తదితర కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఉద్యమానికి సంపూర్ణంగా సహకరించాలని కాలేజీల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీంను యథావిధిగా అమలు చేయాలని, బకాయిలు చెల్లించాలని, ర్యాంకు నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం సభ్యులు దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, చంద్రకాంత్, శ్రీలత, బగ్గలి అజయ్, లక్ష్మణ్ గౌడ్, రేఖ, అవుసుల రాము తదితరులు పాల్గొన్నారు.
● బీసీ సంక్షేమ సంఘం
జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్
● నేడు కళాశాలల బంద్‌కు పిలుపు


