ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలి

Jul 2 2026 3:05 AM | Updated on Jul 2 2026 3:05 AM

ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలి

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

నిజామాబాద్‌అర్బన్‌: నిరుపేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌, న్యూడెమో క్రసీ, ఆరెస్పీ పార్టీల ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అడిషనల్‌ కలెక్టర్‌ భుజంగరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ిపీ సుధాకర్‌, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ నగర కార్యదర్శి ఎంసుధాకర్‌ మాట్లాడుతూ నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించి, గుడిసెలు లేని రాజ్యం తెస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలను నెరవేర్చడం లేదన్నారు. బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతుందని విమర్శించారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు ఓమయ్య, రఘురాం, లింగం, విఠల్‌, పెద్ది వెంకటరాములు, సుజాత, శివరాజ్‌, గంగారెడ్డి, అనిల్‌, నరేశ్‌, అమూల్య, రఫీక్‌, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement