ఆర్మూర్:వైద్యారోగ్యశాఖలో పనిచేసే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి విధి నిర్వహణలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ, సదరు ఉద్యోగి క్షేత్రస్థాయికి వెళ్లగానే విధులు నిర్వహించడం కన్నా పక్కనే ఉన్న వారిని పిలిచి తనను ఫొటో దింపమని బతిమిలాడుకోవాల్సి వస్తోంది. ఇలా దిగిన ఫొటో ను జిల్లాస్థాయి పర్యవేక్షణ అధికారి రూపొందించిన వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తే గానీ ఆ రోజు హాజరుపడని దుస్థితి నెలకొంది.కాంట్రాక్టు ఉద్యోగి చేస్తు న్న పనితీరు ఆధారంగా కాకుండా వాట్సాప్ ఫొటో ఆధారంగా పనితీరును నిర్ధారించుకునే సంస్కృతిని అధికారులు కొనసాగించడంపై తీవ్ర వ్యతిరేకత వ స్తోంది. జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పుడు అసలు ప నికన్నా ఫొటో పని ఎక్కువైపోయింది. రెవెన్యూ, వై ద్య ఆరోగ్య, విద్య, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఐసీడీఎస్ లాంటి వివిధ శాఖల్లో ఉన్నతాధికారులు ప్రతిరోజూ డ్యూటీ చేస్తున్న ఫొటోలు వాట్సాప్ గ్రూ పుల్లో పెట్టాలంటూ ఒత్తిడి చేస్తుండటంతో కాంట్రా క్ట్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మ హిళా ఉద్యోగులకు ప్రతిరోజు ఫొటోలు దిగడం కా స్త ఇబ్బందికరంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టుల పరిధిలో వేధింపులు అధికం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉపాధి హామీ, సమగ్ర శిక్ష, ఐసీడీఎస్, ఐకేపీ లాంటి పథకాల్లో ఈ వాట్సాప్ ఫొటోల వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో ఎక్కువగా రాష్ట్ర, జిల్లా స్థా యి అధికారులు డిప్యూటేషన్‌పై వచ్చిన రెగ్యులర్ ఉద్యోగులు కాగా మండలస్థాయితోపాటు జిల్లా కార్యాలయం సిబ్బంది మొత్తం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే. దీంతో రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నతాధికారులకు తమ పనితనం చూపించుకొనే క్రమంలో కిందిస్థా యి కాంట్రాక్టు ఉద్యోగులపై ఫొటో వేధింపుల కు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. బ యోమెట్రిక్, ఎఫ్‌ఆర్‌ఎస్ లాంటి హాజరునమో దు ప్రక్రియలు కొనసాగుతున్నప్పటికీ వాట్సా ప్ ఫొటోల గోల మాత్రం తప్పడం లేదు. రెగ్యులర్ ఉద్యోగులకు ఇలాంటి ఆంక్షలు లేకపోవడం కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో అసహనం రేపుతోంది. అయితే వాట్సాప్ ఫొటోకు సంబంధించి ఉన్నతాధికారులు ఇప్పటి వరకు మౌఖిక ఆదేశాలే తప్ప అధికారికంగాా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడం గమనార్హం.
వేధింపులతో విసిగిపోతున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు
ఉత్తర్వులు లేకపోయినా
అధికారుల ఆదేశం
ఇబ్బందిపడుతున్న మహిళా ఉద్యోగులు


