బాలలను సంరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

బాలలను సంరక్షించాలి

Jul 2 2026 3:05 AM | Updated on Jul 2 2026 3:05 AM

అదనపు డీసీపీ శుభం ప్రకాశ్‌

ఆపరేషన్‌ ముస్కాన్‌–12 ప్రారంభం

నిజామాబాద్‌అర్బన్‌: తప్పిపోయిన, నిరాశ్రయులైన, వీధి బాలలను గుర్తించి చట్టపరమైన సంరక్షణ కల్పించాలని అదనపు డీసీపీ శుభం ప్రకాశ్‌ పేర్కొన్నారు. పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో బుధవారం శ్రీఆపరేషన్‌ ముస్కాన్‌–12శ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఈ నెల 1 నుంచి 31 వ తేదీ వరకు నెలరోజులపాటు పోలీస్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, విద్యాశాఖ, బాలల సంరక్షణ విభాగం, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆపరేషన్‌ ముస్కాన్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా రైల్వేస్టేషన్‌, బస్‌ స్టేషన్‌లు, మార్కెట్లు, హోటళ్లు, దాబాలు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, గ్యారేజీలు, వర్క్‌షాపులు, నిర్మాణ ప్రాంతాలు, ధార్మిక క్షేత్రాలు, పర్యాటక తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలన్నారు. బాల కార్మికులు, నిరాశ్రయులు, వీధి బాలలు, తప్పిపోయిన చిన్నారులను గుర్తించి పునరావాసం కల్పించాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతోపాటు ప్రతి చిన్నారికి విద్య, భద్రత, ఆరోగ్యం రక్షణ కల్పించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా పేర్కొన్నారు. చిన్నారులను పనులలో పెట్టుకోవడం నేరమన్నారు. అలాంటి ఘటనలు కనిపించిన వెంటనే సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ కోసం నిజామాబాద్‌ డివిజన్‌ ఇన్‌చార్జి ఎస్సై 87125 78236, ఆర్మూర్‌ డివిజన్‌ ఇన్‌చార్జి ఎస్సై 8712659863, బోధన్‌ డివిజన్‌ ఇన్‌చార్జి ఎస్సై 99 85197899 నంబర్లకు సమాచారం అందించాలని తెలిపారు. సమావేశంలో సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ పాండేరావు, జిల్లా వెల్ఫేర్‌ ఆఫీసర్‌, మహిళా, చైల్డ్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సౌందర్య, జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ చైతన్య, జిల్లా అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ ప్రభుదాస్‌, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కల్పన తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement