నిజామాబాద్ అర్బన్: మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందని మెడికల్ కౌన్సిల్ రాష్ట్ర చైర్‌పర్సన్ డాక్టర్ కవితారెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కవితారెడ్డి మాట్లాడుతూ మత్తు పదార్థాలు ఆరోగ్యమే కాకుండా భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు. విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం ప్రణాళికాబద్ధంగా చదివి ప్రతిభ చాటాలన్నారు. కార్యక్రమంలో మహిళా కళాశాల లెక్చరర్లు, విజయ్ పబ్లిక్ స్కూల్ చైర్‌పర్సన్ అమృతలత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


