● డీఈవో అశోక్‌కుమార్
మాక్లూర్: మండలంలోని ధర్మోరా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను డీఈవో అశోక్ కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి జవాబులు తెలుసుకున్నారు. విద్యార్థుల సమాధానాలతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో ఇటీవల ఒకే రోజు 50 మంది పిల్లలు చేరికపై డీఈవో హర్షంవ్యక్తం చేశారు. పిల్లలను ప్రయివేటు స్కూళ్లలో చేర్పించకుండా స్థానికంగా ఉన్న ప్రభుత్వ బడిలో చేర్పించిన జీపీ పాలకవర్గం, గ్రామస్తులను అభినందించారు. విద్యార్థులకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సరైన విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. డీఈవో వెంట సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ నాగేశ్, కాంప్లెక్స్ హెచ్‌ఎం అశోక్, పాఠశాల హెచ్‌ఎం శంకర్, ఉపాధ్యాయుడు కపిల్‌దేవ్, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు ఉన్నారు.


