భూమి సంరక్షణ చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

భూమి సంరక్షణ చర్యలు చేపట్టాలి

Jul 1 2026 1:34 AM | Updated on Jul 1 2026 1:34 AM

మోపాల్‌: రైతులు భూమి సంరక్షణ చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా ఎరువుల వాడకం యూరియా, డీఏపీ వినియోగం తగ్గించాలని ఆత్మ పీడీ తిరుమల ప్రసాద్‌ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు. ఎల్‌నినో కారణంగా వర్షపాతం తక్కువ నమోదవుతుందని నీటి సదుపాయాలను బట్టి ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్‌ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌ హిందూధర్‌రెడ్డి, ఎంపీడీవో రాములునాయక్‌, ఎంపీవో కిరణ్‌కుమార్‌, ఏఈవో రంజిత్‌, ఆత్మ బీటీఎం, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement