తెల్లకోటు దేవుళ్లకు వందనం | - | Sakshi
Sakshi News home page

తెల్లకోటు దేవుళ్లకు వందనం

Jul 1 2026 1:34 AM | Updated on Jul 1 2026 1:34 AM

ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్లు దైవంతో సమానం

నేడు జాతీయ వైద్యుల దినోత్సవం

ఆర్మూర్‌ : ‘దేవుడు కనిపించడు కాబట్టి డాక్టర్లను పంపాడు’ అనే మాట అక్షర సత్యం. తల్లిదండ్రు లు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు. ఎవరైనా అ నారోగ్యానికి గురైనా, ప్రమాదంలో గాయపడినా, అత్యవసర పరిస్థితులో ఉన్నా.. తెలిసిన వెంటనే తమ గురించి పట్టించుకోకుండా తక్షణ చికిత్స అందిస్తారు డాక్టర్లు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా సేవలందించి లక్షలాది మందిని కాపాడారు. నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

భారతరత్న డాక్టర్‌ బిధాన్‌ చంద్రరాయ్‌ జయంతి, వర్ధంతి రెండూ జూలై 1నే. పశ్చిమ బెంగాల్‌ రెండో ముఖ్యమంత్రిగా, గొప్ప వైద్యుడిగా ఆయన చేసిన సేవలకు గుర్తుగా 1991 నుంచి జూలై1 రోజును ’నేషనల్‌ డాక్టర్స్‌ డే’గా జరుపుకుంటున్నాం. ఈ రోజు కేవలం వైద్యులకు శుభాకాంక్షలు చె ప్పుకునే రోజు కాదు. ప్రతి డాక్టర్‌ జీవితంలోని కనిపించని కోణాన్ని తెలుసుకునే రోజు. జిల్లాకేంద్రంలోని ఓ వైద్యుడు రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓపీ చూసి, ఇంటికి వెళ్తాడు. రాత్రి భోజనం చేస్తుండగా ఎమర్జెన్సీ కాల్‌ రావడంతో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుర్రాడికి వేకువజాము వరకు శస్త్రచికిత్స చేసి, కాపాడుతాడు. మర్నాడు ఉద యం మళ్లీ ఓపీకి వస్తాడు. ‘డాక్టర్‌ అయ్యాక నిద్ర మనది కాదు సార్‌. పేషెంట్‌ ప్రాణం మనది‘ అని నవ్వుతూ చెప్పారాయన. వైద్య వృత్తి కారణంగా కుటుంబ పరమైన సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ అలుపెరగకుండా ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు. ఇలాంటి వైద్యులకు తప్పకుండ వందనం చేయాల్సిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement