డిచ్‌పల్లి: మండలంలోని బర్ధిపూర్ శివారులోగల కే శాపూర్ రోడ్డులో ఇటీవల ఏర్పాటు చేసిన ఓ ప్ర యివేట్ స్కూల్/కళాశాలను అనుమతి లేదంటూ ఎంఈవో నరేష్ సీజ్ చేశారు. అంతకుముందు టీ జీవీపీ, యూఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎఫ్‌డీఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సదరు విద్యాసంస్థను ముట్టడించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా విద్యా సంస్థను నడిపిస్తున్నారని పేర్కొంటూ ధర్నా నిర్వహించారు. విద్యాసంస్థ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న డిచ్‌పల్లి ఎస్సై ఆరీఫ్ తన సిబ్బందితో పాఠశాలకు చేరుకుని వి ద్యార్థి సంఘాల నాయకులను సముదాయించా రు. ఈవిషయమై ఎంఈవోకు ఫిర్యాదు చేయగా, అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తే చ ర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించినట్లు తెలిపారు. అలాగే జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవికుమార్ సైతం ఎలాంటి అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసు అందజేసినట్లు తెలిపారు. విద్యార్థి సంఘాల ప్రతినిధులు కళ్యాణ్, సూరి, రాజశేఖర్, నాగరాజు, మహేష్, కెవిన్, వినోద్ పాల్గొన్నారు.
ప్రైవేట్ పాఠశాల స్టోర్ రూమ్..
వర్ని: చందూర్ మండల కేంద్రంలోని శ్రీ సాయి హైస్కూల్ లో స్టోర్ రూమ్ ను మంగళవారం మండల విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్, టై, బెల్టు లు విక్రయిస్తున్నారని ఏబీవీపీ నాయకుల ఫిర్యాదు మేరకు పాఠశాలలో తనిఖీలు నిర్వహించి స్టోర్ రూమ్ ను సీజ్ చేశారు. నాయకులు దర్శనం ప్రవీణ్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.


