ఆర్మూర్: వైద్యులు మానవ శరీరానికి చికిత్స చే స్తే.. చార్టర్డ్ అకౌంటెంట్లు దేశ ఆర్థిక వ్యవస్థకు చికి త్స చేస్తారు. భారత ఆర్థిక రంగానికి వీరు వెన్నె ముక వంటివారు. నేడు జాతీయ ’చార్టర్డ్ అకౌంటెంట్ల’ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
1949 జూలై 1న పార్లమెంట్ చట్టం ద్వారా ’ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా’ (ఐసీఏఐ) ఏర్పడింది. ఐసీఏఐ స్థాపన రోజును పురస్కరించుకుని ఏటా జూలై 1న ’సీఏ డే’ జరుపుకుంటున్నాం. 2026 నాటికి దేశంలో 4 లక్షల మందికి పైగా సీఏలు ఉన్నట్లు అంచనా. జి ల్లాలో సుమారు 40 మంది ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అ కౌంటెంట్లు ఉన్నారు. జిల్లా ఐసీఏఐ బ్రాంచ్ పరిధి లో సుమారు వంద మందికి పైగా సీఏ విద్యా ర్థులు శిక్షణ పొందుతున్నారు. సీఏలు టాక్స్ ఫై లింగ్ మాత్రమే కాదు. కంపెనీ ఆడిట్, బ్యాంకు లోన్ ప్రాజెక్ట్ రిపోర్టులు, స్టార్టప్‌లకు ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫోరెన్సిక్ ఆడిట్, ప్రభుత్వ శాఖలకు కన్సల్టెన్సీ. ఒక మాటలో చెప్పాలంటే దేశంలో ’బ్లాక్ మనీ’ని ’వైట్’గా మార్చేది, ’వైట్ మనీ’ని కాపాడేది సీఏలే. ‘టాక్స్ కట్టడం దేశభక్తి. కానీ చట్ట ప్రకారం కట్టాల్సిన దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ కట్టొద్దు. అదే మా డ్యూటీ‘ అని సీఏలు పేర్కొంటున్నారు. ఇలా దేశ ప్రగతి కోసం పాటుపడే చార్టర్డ్ అకౌంటెంట్లకు ఈరోజు సెల్యూట్ చేద్దాం.


