సిరికొండ: నేరాల నియంత్రణకు నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని నిజామాబాద్ సీపీ సాయిచైతన్య అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో మంగళవారం సీపీ వార్షిక తనిఖీలు నిర్వహించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసు ల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. స్టేషన్‌లో అమలవుతు న్న 5ఎస్ విధానం తీరును సమీక్షించి, ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంలో ప్రతి అ ధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తె లిపారు. సిరికొండకు సరిహద్దులో ఉన్నటువంటి జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన రహదారులపై నిఘా పటిష్టపరచాలని తెలిపారు. సిబ్బంది 24/7 స్థానికంగా అందుబాటులో ఉండాలని తెలిపారు. అనంతరం స్టేషన్ ఆవరణలో సీపీ మొక్క నాటారు. నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్‌యాదవ్, ధర్పల్లి సీఐ భిక్షపతి, సీసీఆర్‌బీ సీఐ అంజయ్య, స్థానిక ఎస్సై రామకృష్ణ పాల్గొన్నారు.
● సీపీ సాయిచైతన్య
● సిరికొండ పోలీస్‌స్టేషన్ తనిఖీ


