ఆర్మూర్‌టౌన్: ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపిన వివరాలు ఇలా.. పెర్కిట్‌లోని కేవీఆర్ కాలనీకి చెందిన గౌతమి(37) ప్రభుత్వ ఉ పాధ్యాయురాలుగా విధులు నిర్వహించేది. కొన్ని రో జులుగా మానసిక ఒత్తిడి కారణంగా అనారోగ్యాని కి గురైంది. ఎన్ని ఆస్పత్రుల్లో చూయించినా ఆమె ఆరోగ్యంలో మార్పు రాలేదు. ఈక్రమంలో ఈనెల 28న ఽమధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేనిసమయంలో ఆమె యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. భర్త రాజు ఆమె ను వెంటనే జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కాగ మంగళవారం చికిత్స పొందుతూ ఉదయం మృతిచెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.


