ఆర్మూర్‌లో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

ఆర్మూర్‌లో ఉద్రిక్తత

Jun 30 2026 1:24 AM | Updated on Jun 30 2026 1:24 AM

పట్టణంలో ఆంక్షలు... ఎమ్మెల్యే నివాసంలో బీజేపీ నేత అరెస్టు

న్యూస్‌రీల్‌

పెర్కిట్‌లోని ప్రైవేట్‌ పాఠశాలలో ఓ వర్గం మత ప్రార్థనలు ర్యాలీ నిర్వహించిన బీజేపీ శ్రేణులు, పోలీసులకు ఫిర్యాదు పాఠశాలలో విచారణ జరిపిన సీపీ సాయి చైతన్య ఇరువర్గాలపై కేసులు నమోదు చేసిన పోలీసులు

నిజామాబాద్‌

ప్రజావాణికి ప్రాధాన్యమివ్వాలి

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని

కలెక్ట ర్‌ త్రిపాఠి అధికారులను ఆదేశించారు.

మంగళవారం శ్రీ 30 శ్రీ జూన్‌ శ్రీ 2026

– 8లో u

ఆర్మూర్‌ : ఆర్మూర్‌ పట్టణం పెర్కిట్‌లోని ఓ ప్రవేయిట్‌ అప్పర్‌ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు ఒక వర్గానికి చెందిన మత ప్రార్థనలు చేయించడంపై మూడు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మత మార్పిడికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు పాఠశాలలో శనివారం ఆందోళన చేయడం, ఉపాధ్యాయులపై చేయి చేసుకోవడంతో హైదరాబాద్‌ నుంచి తరలి వచ్చిన ఆ వర్గం నాయకులు ఆదివారం ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ముట్టడి చేసారు. సోమవారం విద్యా సంస్థల బంద్‌ పాటించి ఉపాధ్యాయులపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకోవాలంటూ డిమాండ్‌ చేసారు. ర్యాలీ, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రకటించారు. మరో వైపు బీజేపీ నాయకులు కూడా పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో ఆర్మూర్‌ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తు చర్యలో భాగంగా భారీ పోలీసు బలగాలను మోహరించారు. ర్యాలీలో పాల్గొనడానికి హైదరాబాద్‌ నుంచి ఆర్మూర్‌కు వస్తున్న ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డిని భిక్కనూర్‌ టోల్‌ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులాచారి పోలీసులను తప్పించుకొని ఆర్మూర్‌ పట్టణానికి వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్మూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, మండల విద్యాధికారి రాజగంగారాంకు వేరు వేరుగా వినతి పత్రాలు సమర్పించి పాఠశాల యాజమాన్యం, మత ప్రార్థనలు చేయించిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసారు.

జిల్లా సీపీ సాయి చైతన్య ఆర్మూర్‌ పట్టణంలో బీఎన్‌ ఎస్‌ 163ను మంగళవారం వరకు విధించారు. ఈ సెక్షన్‌ను అనుసరించి రెండు రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐదుగురు మించి గుంపులుగా ఉండటం ని షేధం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అనుమానితులను అదుపులోకి తీసుకొనే అవకాశం ఉంది.

ఆర్మూర్‌ పట్టణంలోని పాఠశాలలో వివాదానికి సంబంధించి ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఆర్మూర్‌ తహసీల్దార్‌ స త్యనారాయణ ఫిర్యాదు మేరకు ప్రయివేట్‌ పాఠశా ల కరస్పాండెంట్‌, ఇద్దరు ఉపాధ్యాయులపై కేసు న మోదు చేసారు. అదేవిధంగా బీజేపీ పట్టణ నాయ కులపై బీఎన్‌ఎస్‌ కింద వేరు వేరుగా కేసులు నమో దు చేసారు. రెండు ఘటనలపై ఆర్మూర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు

ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌లోని ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి నివాసంలో బీజేపీ నాయకుడిని ఆర్మూర్‌ సీఐ సత్యనారాయణ తన పోలీసు బలగాలతో అదుపులోకి తీసుకున్నారు. సీపీ సాయి చైతన్య పెర్కిట్‌లోని ప్రయివేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి

ఆర్మూర్‌ టౌన్‌ : ఆర్మూర్‌ పట్టణం పెర్కిట్‌లోని ప్రయివేట్‌ పాఠశాలలో ఓ వర్గానికి చెందిన మత ప్రార్థనలు చేయించారని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్‌ మీదుగా ఆర్మూర్‌ ఏసీపీ కార్యాలయం వరకు ర్యాలీలో సాగింది. అనంతరం ఏసీపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్నా దినేష్‌ మాట్లాడారు. అనంతరం ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అక్కడి నుంచి ఆర్మూర్‌ మండల విద్యాధికారి కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించి ఎంఈవో రాజగంగారాంకు పాఠశాల గుర్తింపును రద్దు చేయాలంటూ వినతి పత్రం సమర్పించారు. ధర్నాలో బీజేపీ నాయకులు కంచెట్టి గంగాధర్‌, పొల్కం వేణు, యామాద్రి భాస్కర్‌ పటేల్‌, కలిగోట ప్రశాంత్‌, దోండి ప్రకాష్‌, ద్యాగ ఉదయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement