డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న తాత్కాలిక అధ్యాపక / ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారిణి జి.విజయలలిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా సంస్థల వారీగా ఖాళీలను ప్రకటించారు. ధర్మారం (బి) బాలికల గురుకులంలో బోటని(1), జూవాలజీ (1), కెమిస్ట్రీ (1), సోషల్ స్టడీస్ (1), లైబ్రేరియన్(1), కంజర బాలికల గురుకులంలో తెలుగు లెక్చరర్ (1), టీజీటీ హిందీ (1), ఇంగ్లిష్(1), ఫిజికల్ సైన్సు(1), బయో సైన్సు (1), పోచంపాడ్‌లో జువాలాజీ(1), కెమిస్ట్రీ(1), సుద్దపల్లి గురుకులంలో ఫిజికల్ సైన్సు పీజీటి (1), సోషల్ స్టడీస్ (1), నవీపేటలో సోషల్ స్టడీస్ (పీజీటీ) (1), బోధన్ బాలుర గురుకులంలో మ్యాథ్స్ లెక్చరర్ (1), హెల్త్ సూపర్‌వైజర్ (1), ఆర్మూర్ బాలికల డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్(1), కామర్స్ (2), ఫిజికల్ డైరెక్టర్ (1) పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. జూనియర్ లెక్చరర్‌కు సంబంధిత సబ్జెక్టులో పీజీ 50 శాతం మార్కులతోపాటు బీఈడీ, డిగ్రీ లెక్చరర్‌కు పీజీ 55శాతం మార్కులతో పాటు నెట్/సెట్ ఉత్తీర్ణత తప్పనిసరని, బాలికల విద్యాలయాలకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. డిగ్రీ లెక్చరర్‌కు రూ.32,500, జూనియర్ లెక్చరర్‌కు రూ.23,400, పీజీటీ, టీజీటీలకు రూ.18,200 గౌరవ వేతనం చెల్లించబడుతుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 5వ తేదీలోగా సంబంధిత కళాశాలలో సమర్పించాలని పేర్కొన్నారు. జూలై 7న డెమో క్లాసులు ఉంటాయని వివరించారు.


